Wednesday, April 6, 2016

గారెల పిండి(vada batter preparation)

vada

గారెలు చేయటం చాలా మందికి తెలుసు . కాని  అందరికి బాగా కుదరవు . దానికి కారణం పిండి . గారెల పిండి ని బట్టి గారెలు వస్తాయి . 
గారెలు ఎప్పుడు golden shade లో ఉంటే బాగుంటాయి . పైన crispy గా ఉండి లోపల మెత్తగా ఉంటాయి . golden shade లో గారెలు రావాలంటే పిండి రుబ్బెటప్పుడు పెసరపప్పు కలపాలి .. 
ఒక పెద్ద  గ్లాస్ మినప పప్పుకి  ఒక cup పెసరపప్పు కలిపి నాన బెట్టాలి .. 
పిండి రుబ్బెటప్పుడు  water ఎక్కువ పట్టవు (ఇడ్లి ,దోసాల పిండి లాగా ). పిండి ని  మరీ గట్టిగ రుబ్బకూడదు (గారి గట్టిగా వుంటుంది )అలాగని మరి జారుగా రుబ్బ కూడదు. గారెలు చేసేటప్పుడు ఉండ రాదు .. అందుకే grinder తిరగ డానికి అన్నట్టు కొంచం కొంచం water పోసుకోవాలి .. సుమారుగా ఒక చిన్న glass  water  సరిపోతుంది .   గారెలు crispy గా కావాలనుకుంటే  పిండిని మరీ మెత్తగా రుబ్బకూడదు .పిండి ని ముట్టుకుంటే ఎక్కడో కొంచెం రవ్వగా(పలుకుగా )వుండాలి . అప్పుడే గారెలు నూనెలొ వేగేటప్పుడు  పైన పిండి crispy గ లోపల పిండి మెత్తగా వేగుతాయి .. గారెలు వేసేటప్పుడు చేతిని water  తో 
ప్రతిసారి తడుపుకోవాలి .. అప్పుడే గారెలు easy  గా నునె లోకి జారుతాయి ..గారే వేగిం దనటానికి గుర్తు  గారెకు వున్న hole నుంచి నునె బయటికి వస్తుంది 
  

No comments:

Post a Comment