Tuesday, April 5, 2016

ugadhi pachchadi

ఉగాది పచ్చడి ఎప్పుడు అమ్మ చేస్తే తినటం కాదు . ఈ ఇయర్ (సంవత్సరమ్ )మీరు చేసి అమ్మకి సర్ ప్రైజ్ ఇవ్వండి . 
ugadhi pachchadi

షడ్ రుచోపేతమైన ఉగాది పచ్చడి :
వేపపూత :1కట్ట 

 వేప పూత లో  పువ్వులను  మాత్రమే  వలుచుకోవాలి . చిన్న చిన్న కాయలను ,ఇంకా  తయారవ్వని  పువ్వులను  వలుచుకోకూడదు . దీని వల్ల  పచ్చడి  చేదు  ఎక్కువగా  వుంటుంది . ఇది  హెల్త్  కి  మంచేదే  కానీ  పచ్చడి  టేస్ట్  మారిపోతుంది . పువ్వుల్లన్ని  వలిస్తే  2 స్పూన్స్  ఐతే  చాలు . 
చక్కెర కేళి :3

చాల మంది అరిటి పళ్ళు  వాడతారు . కానీ  చెక్కర కేళి వల్ల ఉగాది పచ్చడి రుచి పెరుగుతుంది.  చక్కెర కేళి ని అన్ని పదార్దములు(ఐటమ్స్ )కలిపిన తరువాత  అంటే  లాస్ట్ కి రౌండ్ గా కానీ  మనకి నచ్చిన సైజు లో  గాని  కోసుకొని పచ్చడి కి యాడ్  చెయ్యాలి .లేకపోతె  చెక్కర కేళి తొందరగా  నలుపు వచ్చి పచ్చడి అందంగా వుండదు .  చింతపండు రసం పోసాక  చెక్కర కేళి ని కలిపితే నల్లబడదు .
మామిడి  కాయ :చిన్నది 
       చిన్న   సైజు  ముక్క అయిన  సరిపోతుంది . దీన్ని చాల చిన్న ముక్కలుగా (మన  పన్ను సైజు లో )కోసుకోవాలి . 
చింతపండు (కొత్తది ):2రేకులు 
        కొత్త చింతపండు అయితే  బాగుంటుంది . కప్ కి  సగం నీళ్ళలో  నాన     బెట్టాలి . పచ్చడి  బాగా నీళ్ళ లా  కావాలనుకుంటే  ఎక్కువ  వాటర్  లో        చింతపండుని నానబెట్టాలి . 


కారం :చిటికెడు (pinch ) 
సాల్ట్ :చిటికెడు (pinch )
పుట్నాల పప్పు (వేయించిన శనగ పప్పు ):హాఫ్ కప్ 
బెల్లం :చిన్న ముక్క 
  బెల్లం  ని మెత్తగా దంచుకోవాలి . దీనిలో  వేపపువ్వు ,మామిడి కాయ ముక్కలు ,కారం ,సాల్ట్,పుట్నాలపప్పు ,నానపెట్టిన చింతపండు ని బాగా పిసికి వాటర్ తో సహా (చింతపండు రసం ) పోసుకోవాలి . లాస్ట్ కి  చెక్కర కేళి ని కట్ చేసి  ముక్కలను వీటిలో  వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి . ఇది గుజ్జు లాగా వస్తుంది . చాల మంది ఉగాది పచ్చడిని వాటర్ లాగా (రసం )చేసుకుంటారు . అందుకే చింతపండు నానపెట్టేతప్పుడు వాటర్ ని మన ఇష్టాన్ని బట్టి పోసుకోవాలి .  కావాలనుకుంటే  జీడిపప్పు ని కూడా  యాడ్  చేసుకోవచ్చు . 
ఈ షడ్రుచోపేత మైన ఉగాది పచ్చడి ని తిని  దుర్ముఖి నామ  సంవత్సరమ్ ను ఆహ్వానిద్దాం . 



No comments:

Post a Comment