Tuesday, April 12, 2016

ravva laddu రవ్వ లడ్డు

రవ్వ లడ్డు ని బొంబాయి రవ్వతో (సుజీ )చేస్తారు .. రవ్వ లడ్డు taste బాగా రావటానికి main reason రవ్వ ను వేపటం .. దేనినైన వేపేటప్పుడు  flame ని sim  లోగాని medium  లోగాని పెట్టుకోవాలి .. high లో పెడితే రవ్వ వేగకుండా shade మారి పోతుందే గాని  taste బాగా రాదు .. దేనినైన వేయించుకునే టప్పుడు మందపాటి గిన్నెను వాడాలి .. దీనివల్ల item (రవ్వ )మాడిపోదు,అడుగు పట్టదు .. 
ravva laddu

ingredients 


బొంబాయి రవ్వ             - 1cup 
sugar                          -1cup 
జీడిపప్పు ,బాదంపప్పు  -1/4cup (మన ఇష్టం బట్టి )
ghee                           -1cup 
పాలు                           -small glass (1/2cup )
elachi (యాలకులు )    -6

మందపాటి గిన్నెలో   నెయ్యి వేసి , కాగిన తరువాత  జీడిపప్పు ,బాదం పప్పు లను golden shade వచ్చేవరకు   వేయించుకొని  పక్కన పెట్టుకోవాలి .. ఆ నెయ్యి(ghee )లోనే  రవ్వను వేయించుకోవాలి . రవ్వ colour మాడ కూడదు .. లడ్డు white గా  వుండదు .. కానీ sim లో ఎక్కువ సేపు వేగనివ్వాలి .. 
రవ్వ ను తింటే  పచ్చి వాసన రాకూడదు .. కరకర లాడుతున్నట్టు వుండాలి .. అప్పుడే బాగా వేగినట్టు అర్ధం ..stove -off  చేసి  sugar ను వేడిగా వున్న రవ్వకి add చేయాలి . ఎలాచి (elachi )ని కొంచం(1teaspoon )sugar వేసి mixie పట్టాలి .. ఈ powder ను రవ్వ,sugar లకు add చేసి బాగా కలపాలి .. దీనికి జీడిపప్పు ,బాదంపప్పు వేయించినవి కలపాలి .. 
కొంచం సేపు  చల్లారనివ్వాలి .. 
పాలను (milk )బాగా కాచాలి .. వేడి గా వున్న పాలను కొంచం కొంచం రవ్వ మిశ్రమానికి add  చేస్తూ  కలుపుకోవాలి .. ఉండ వచ్చేదట్టు  కలుపుకొని లడ్డు లాగా చేసుకోవాలి .. ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి .. పాలు బాగా వేడిగా ఉంటేనే ఉండ (laddu shape )వస్తుంది .. కొంచం పాలకే  రవ్వ మిశ్రమం జారుగా  అయిపోతుంది ..చాలా జాగ్రత్త గా   కొంచం కొంచం పాలు  కలుపుకోవాలి .. 

No comments:

Post a Comment