Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Thursday, April 14, 2016

coconut chutney with milk కొబ్బరి పచ్చడి

 ఈ కొబ్బరి chutney చూడటానికి pure  white గా వుండి ,చాల tastey గా వుంటుంది . దానికి కారణం milk ని add చేయటమే  . mixie పట్టే డప్పుడు water కి బదులు milk (creamy milk ) ని add  చేస్తే taste తోపాటు అందంగా కూడా వుంటుంది.  
coconut chutney

కొబ్బరి చిప్పను పగలగొట్టి పెంకును తీసి వేయాలి . అప్పుడు చిప్ప వెనుక బాగం  brown గా కనబడుతుంది . దాన్ని peeler తో తీసివేయాలి .ఇలా చేయక పొతే chutney white గా కనిపించదు .  ఇప్పుడు కొబ్బరి చిప్పని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి mixie jar లో వేయాలి . 
greenchillies (పచ్చిమిర్చి )ని బాగా కడిగి half  గ cut చేసి వేడెక్కిన oil లో వేసి కొంచం సేపు వేగనివ్వాలి . వీటిని mixie jar లో వేసి salt కూ డ వేసి ఒక round mixie పట్టాలి . కొంచం కొంచం పాలను add చేస్తూ grind చేయాలి . దీనికి పచ్చి మిర్చి మామూలు గా  మీరు చేసే కొబ్బరి పచ్చడి కంటే 2 to 4 ఎక్కువగానే పడతాయి. పాలు chutney ని సవ్వగా చేస్తుంది . అందుకే కారం కోసం పచ్చి మిర్చి కొంచం add చేసుకోవాలి . బాగా కారంగా వుంటే దీనికి 2to 5spoons పెరుగు (curd )కలుపుకుంటే సరిపోతుంది . 
తాలింపు : ఆవాలు,సాయి మినపప్పు ,కర్వేపాకు వేసి తాలింపు పెట్టాలి . 
ఈ chutney ని తప్పకుండా try చేయండి . 100% మీకు  నచ్చుతుంది . 

Wednesday, April 13, 2016

idle sambar ఇడ్లి సాంబార్

ఇడ్లి లోకి coconut chutney, కారప్పొడి,నెయ్యి   బాగానే వున్నాఇడ్లి లోకి సాంబార్  special జోడి గా చెబుతారు . భోజనం లో  తినే సాంబార్ ,ఇడ్లి లో వేసుకునే సాంబార్ వేరు వేరు . భోజనం సాంబార్ లో కందిపప్పు ఎక్కువుగా వాడితే ,ఇడ్లి లో సాంబార్ కి పచ్చి శనగ పప్పు ఎక్కువుగా వాడతారు . 
చాల fast గా ఈ సాంబార్ తయారు చేసుకోవచ్చు . 
idle sambar
  ingredients 

ఎండుమిర్చి  -4
coriander (దనియాలు ) -1/2teaspoon 
కందిపప్పు                     -4spoons 
పచ్చి శనగ పప్పు          -7spoons 
మిర్యాలు                      -1/4teaspoon 
జీల కర్ర                       -1/2teaspoon 
కొబ్బరి తురుము           -1cup 
tomato                         -1
సాల్ట్                             -1spoon 
చింతపండు (tamarind ) -1రేకు 
ఇంగువ                        -పించ్ 
oil                               -3spoons 
mustard seeds            -1/4teaspoon 
cumin  seeds             -1/4teaspoon 
onion                         -1
sugar                          -2spoons
కర్వేపాకు                     -కొంచం 
కొత్తిమీర                      -కొంచం 

గిన్నెలో 2spoons oil వేసి కాగిన తరువాత redchillies వేసి వేగనివ్వాలి . వేగినతరువాత వాటిని తీసి ,దనియాలు వేసి పచ్చివాసన లేకుండా 10seconds వేగనిచ్చి తిసివేయాలి . కందిపప్పు ను  అదే నునె లో వేసి color మారేవరకు వేగనివ్వాలి . వేగిన కందిపప్పు మంచి వాసన వస్తుంది . కందిపప్పు ను తీసి, నునె లో పచ్చి శనగ పప్పు వేసి వేగనివ్వాలి . మిర్యాలు  కూడ వేసుకోవాలి . తరువాత tomato ముక్కలు వేసి టమాటో మగ్గిన 
తరువాత కొబ్బరి తురుము వేసి last కి ఇంగువ వేయాలి . అన్నిటిని కొంచం వాటర్ పోసుకొని grind  చేసి మెత్తటి paste లాగా తయారు చేసుకోవాలి . 
వేయించే తప్పుడు ఏది మాడ కూడదు.  మాడితే  sambar రంగు మారిపోతుంది .  
వేరొక గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తరువాత ఆవాలు,జీల కర్ర ,కర్వేపాకు వేసి తరువాత  ఈ paste వేసుకొని చిక్కదనాన్ని బట్టి తగినన్ని వాటర్,salt  వేసుకోవాలి . చింతపండు రసం తీసుకోని దీనికి add చేయాలి . sugar ని కూడా add చేసి బాగా మరగనివ్వాలి .  మరుగుతున్నప్పుడు సాల్ట్ గాని sugar గాని సరిపోనాయో లోదో చూసుకోవాలి .last  కి కొత్తిమీర add  చేసి stove -off చేయాలి . 

ravva idle రవ్వ ఇడ్లి

మనం ఎక్కువగా break fast కి ఇడ్లి (మినపప్పు తో చేసినది ),దోశ ,ఉప్మా లను ఎక్కువగా చేసుకుంటాం . కొంచం బోర్ కొట్టినప్పుడు   బొంబాయి రవ్వ తో చేసిన  ఇడ్లి లు variety గాను tasty గాను వుంటాయి . వీటిని instant గ అప్పటికప్పుడు చేసుకోవచ్చు .  అను కోకుండా  వచ్చిన guest లకు variety tiffin easy గా ready అవుతుంది .
rava idle


ingredients 

బొంబాయి రవ్వ                       -1cup 
curd (పెరుగు )                       -1cup 
ఆవాలు(mustard )                 -1/2teaspoon 
cumin seeds (జీల కర్ర )          -1/2teaspoon 
urad dal (మినపప్పు )            -1/2teaspoon 
పచ్చి శనగపప్పు                     -1/2teaspoon 
జీడిపప్పు                               - 5 to 10
కర్వేపాకు                                 -5 to 10leaves 
కోరిన కార్రెట్ (grated carrot )    -3spoons 
కొత్తిమీర (coriander leaves )  -కొంచం 
oil                                          -4spoons 
salt                                        -1/2spoon (to taste )
oil  వేడెక్కిన తరువాత ఆవాలు,జీల కర్ర,మిన్నపప్పు ,శనగ పప్పు ,జీడిపప్పు last లో కర్వేపాకు వేసి రవ్వను కూడా వేసి కొంచం సేపు వేగనిచ్చి  (1minute ) చల్లారనివ్వాలి . curd లో కొంచం (1/4cup) water కలిపి buttermilk లాగా చేసి రవ్వకి add చేయాలి . idle  పిండి లాగా వుండే దట్టు  చేసి salt ని add చేసుకోవాలి .

idle రేకులకు నెయ్య రాసి తురుమిన carrot ,రెండు కొత్తిమీర ఆకులు రేకుచుట్టు వేసి వాటిపై రవ్వ పిండి ని వేయాలి. వీటిని idle  లాగా ఆవిరి పై ఉడికించాలి .   సుమారు 15 to 20 minutes లో రవ్వ ఇడ్లి రెడీ అవుతాయి .
రేకుల నుంచి ఇడ్లి తీసిన తరువాత plate లో ఇడ్లిని  తిప్పి పెడితే carrot ,కొత్తిమీర తో ఇడ్లి అందం గా వుంటుంది .  
coconut చట్నీ తో తింటే బావుంటుంది . 

mango pickle ఆవకాయ పచ్చడి

summer  season  హాట్ గా ఉన్నా  mangoes కి  season కావటం వల్ల చాల మంది ఇష్టపడతారు . mango seasonal fruit కావటం వల్ల పూర్వము pickle గా నిల్వ ఉంచేవారు .. summer లో   ఆవకాయ పచ్చడి పట్టని వాళ్ళు వుండరు. గోంగూర పచ్చడి ,ఆవకాయ పచ్చడి తెలుగు వారి special వంటకాలు .వివాహ భోజనంలో ఈ రెండు పచ్చళ్ళు లేకుండా తెలుగు వారు భోజనం పెట్టరు . ఆవకాయ అంటే చాల experience ఉంటేనే ఈ pickle పట్టగలం అనుకుంటారు . అది తప్పు . కూరలు వండటం కన్నా పచ్చడి పెట్టటం చాల easy . ఎందు కంటే  పచ్చడికి సరియిన కొలత వుంటుంది . ఆ కోలత బట్టి ఈజీ గా అన్ని ingredients  కలేపేయ వచ్చు .పొయ్య మీద పెట్టి వండాలిసిన పనిలేదు (తాలింపు తప్ప ).  కానీ ఏ పచ్చడి కైనా తడి తగలకూడదు . నిల్వ వుండే పదార్దానికి తడి తగిలితే బూజు (fungues )పడుతుంది . ఆ జాగర్త పాటిస్తే pickle చాల రోజులు పాడవకుండా వుంటుంది . 
market లో చాలా varities of mangoes వుంటాయి . సహజం గా గులాబీలు,
రసాలు ,జహంగీర్ లాంటివి ఆవకాయకి ఉపయోగిస్తారు .నేను చిన్న రసాలను prefer చేస్తాను .. ఎందుకంటే చిన్న రాసాలికి కండ ఎక్కువుగా వుండి  mango piece తింటున్నప్పుడు కరకర లాడుతున్నట్టు వుంటుంది . 
సహజంగా 12(dozen ) చిన్న రసాలకీ  4 శేరులు (kgs )ముక్కలు అవుతాయి .. ఈ లెక్కను బట్టి మీకు ఎన్ని  mangoes కావాలో చూసి  కొన్నుక్కో వచ్చు . 
మామిడికాయ ముచ్చుక ను కట్ చేసి (మామిడి కాయ ను కోసే తప్పుడు సోన కారుతుంది కాబట్టి ) water లో కాసేపు నాననివ్వాలి . తరువాత cotton cloth తో బాగా తుడవాలి . తడి అనేది ఉండకూడదు . బాగా తుడిచిన తరువాత మామిడి కాయను సగానికి cut చేయాలి .అప్పుడు  జీడి కూడా cut అవుతుంది . దీనికి కొంచం experience వుండాలి . సహజంగా market లో ఆవకాయలకి ముక్కలు cut చేసేవాళ్ళు వుంటారు (సీజన్లో అయితే  ). వాళ్లతో cut చేస్తే మన పని easy అవుతుంది .  2pieces  గా cut అయిన మామిడికాయ ముక్కలో జీడి పొర వుంటుంది . అది తీసివేయాలి .  మనకి కావలిసిన size లో ముక్కలు cut చేసుకోవాలి . ముక్కలను పొడి cloth తో తుడవాలి . తుడిచిన వాటిని వేరొక  పొడి cloth పైన ఆరనివ్వాలి .ముక్కల్లో  white గా వున్నది  పై వైపు వుండి ,green అడుగున వచ్చే దట్టు ఆర బెట్టాలి . అన్ని పచ్చళ్ళు లాగా కాకుండా ఆవకాయలకి సన్న ఆవాలు(mustard seeds ) వాడాలి . 
ఆవాలు చాలా మెత్తగా mixie పట్టాలి . పిండి జల్లెడతో జల్లించు కోవాలి . 
ఆవాలు వేపకూడదు.పచ్చివే mixie పట్టాలి . 
మెంతులు నునె లేకుండా వేయించుకోవాలి . మెంతులు brown shade   వచ్చే వరకు sim లో వేయించాలి . వేగిన మెంతులు మంచి వాసన వస్తాయి . చల్లరిన తరువాత వీటిని కూడా మెత్తగా mixie పట్టాలి . 
salt  గళ్ళు ఉప్పు వాడాలి .ఇది పచ్చడిని నిల్వ ఉంచుతుంది . ఉప్పుని mixie లో మెత్తగా grind చేసుకోవాలి . 
కారం  ఎప్పుడూ  పచ్చడికి  పచ్చి కారం వాడాలి . కూరలో వాడే కారం(సాంబార్ కారం ) వాడకూడదు. పచ్చి కారం అంటే ఎండి మిర్చిని పోడిచేస్తే వచ్చేది .(ఏ దినుసులు కలప కుండా వున్నది )  . 
oil ఎప్పుడు పప్పు నూ నె వాడితే మంచిది . కొందరు వేరుశనగ నునె వాడతారు . ఎవరి ఇష్టాన్ని బట్టి oil వాడవచ్చు .  
పచ్చడి కి taste ని పెంచే  items లో garlic (వెల్లులి )ఒకటి . వెల్లుల్లి వలవటం చాల పెద్ద పని . కొంచం ఆయిల్ రాసి నీరెండలో వెల్లుల్లి రేకులను పెట్టి 2hours తరువాత వాటిని  నలుపుతుంటే పొట్టు easy గా వస్తుంది . 
avakaya pickle

ingredients 

mango pieces (మామిడి కాయ ముక్కలు ) -8cups 
పచ్చి కారం                                                - 1cup 
గళ్ళు ఉప్పు పొడి                                       -1cup 
పసుపు (turmaric )                                   -1spoon 
ఆవపిండి                                                   -1cup 
మెంతిపిండి                                                -1/4cup 
వెల్లుల్లి పాయలు (గార్లిక్ )                            -4
 oil                                                          -1 1/4cups 
మెంతులు                                                 -1/2spoon 

కారం ,salt ,మెంతిపిండి ,ఆవపిండి ,పసుపు ,మెంతులు ,వెల్లుల్లి రొబ్బలు (cloves )అన్నిటిని కలుపుకోవాలి . 
ఒక గిన్నెలో oil పోసుకొవాలి .  ఆరిన  mango ముక్కలను కొంచం కొంచం తీసుకోని oil లోముంచి అన్ని ingredients కలుపుకున్న పొడి లో దొర్లించి dry గా వున్నా డబ్బాలో వేసుకోవాలి . వీటి మీద కొంచం పొడి చల్లుకోవాలి . మళ్ళా కొన్ని mango  ముక్కలను   ఆయిల్ లో ముంచి పొడిలో దొర్లించి డబ్బాలో వేయాలి . ఇలా అన్ని ముక్కలను వేసాక మిగిలిన పొడిని పైన జల్లి మిగిలిన oil  ని డబ్బాలో ని ముక్కాల మీద పోసేయాలి . గట్టిగా  మూత పెట్టాలి . 
మూ డవ రోజు (3days  after ) 2వెల్లుల్లి పాయలను వలుచుకొని  పేస్టు చేసి పచ్చడి కి కలుపుకోవాలి . పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకొని taste చూసి సాల్ట్ గాని కారం గాని సరిపోకపోతే కొంచమ్ add చేసుకోవచ్చు . పచ్చడి మొత్తం కలిపినా తరువాత పాలు విరిగినట్టు (కతుపులు, కతుపులుగా )పచ్చడి వుంటే పాళ్ళు అన్ని సరిపోయినాయని అర్ధం . 

Tuesday, April 12, 2016

potato kurma(aloo kurna)బంగాళ దుంప కుర్మా

potato  ఇష్ట పడని వాళ్ళు చాల తక్కువ మంది వుంటారు .. పిల్లలకి ఇది favourite dish అని చెప్పాలి .. carbohydrates ఎక్కువ ఉంటుందని  బరువు పెరుగుతామని చాలామంది తినరు .. ఇదే కాదు ఏ food ఐన మోతాదుకి (limit )మించి తింటే ప్రమాదమే .healthy foods తినటం workouts చేయటం body కి చాల మంచిది .. ఈ  కుర్మా చపాతీ లోకి  చాలా బావుంటుంది .. చాలామంది కుర్మా కర్రీ బాగానే చేస్తారు గాని  కర్రీ చూడటానికి కతుపులు కతుపులుగా తెల్ల తెల్ల గా  (curd వల్ల )వుంటుంది .. ఇది చూడటానికి బాగోదు .. curd  ని బాగా చిలికిన తరువాత నే కర్రీ లోకి  add చేస్తే ఇలా వుండదు  ..  
kurma

ingredients 

పొటాటో (potato )                 -1/2kg 
టమాటో (tomato )               -2
onion (ఉల్లి పాయ )              -2
green  chilli                       -5
ginger garlic paste            -2spoons  
curd (చిక్కటి పెరుగు )          -2cups 
cloves (లవంగాలు )             -5
elachi (యాలకులు )            -2
coriander (దనియాలు )        -1spoon 
poppy seeds (గసగసాలు )    -4spoons 
cashew nuts (జీడిపప్పు )     -10
mint leaves (పుదినా )          -1/4cup 
coriander leaves                 -1/2cup 
turmaric powder(పసుపు)    -pinch (చిటికెడు )
red  chili powder                 -1 1/2spoons (as per your taste )
salt                                      -1 1/2spoons  (as per your taste )     

potatoes బాగా కడిగి 4pieces గా cut చేసుకొని cooker లోగాని, పోయ్యమిదగాని ముక్కలు మునిగేవరకు water పోసి ఉడికించాలి. cooker లో అయితే ఎక్కువ water పోయనవసరం లేదు . కొంచం water పోసి 3whistles (3విజిల్స్ )వచ్చేవరకు వుడకనివ్వాలి ..  
వుడికిన తరువాత potatoes పొర వలుచుకొని చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి .. 
cloves (లవంగాలు ),elachi ,coriander (దనియాలు ),poppy seeds (గసగసాలు )   mixie  లో వేసి మెత్తగా చేయాలి .. జీడిపప్పు కూడా వేస్తె గసగసాలు మెత్తగా నలగవు . అందుకే గసగసాలు నలిగినా తరువాత cashewnuts వేసి grind  చేయాలి . దీనికి కొంచం water  add చేసి పేస్టు లాగా  చేయాలి .. 
 గిన్నెలో oil  4spoons వేసి వేడెక్కిన తరువాత 2spoons (నెయ్యి ) ghee వేయాలి . ఘీ melt  అయిన తరువాత onion pieces (ఉల్లి పాయ ముక్కలు )greenchilli pieces (పచ్చి మిర్చి ముక్కలు )వేసి golden కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి .ginger garlic paste వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి .. అల్లంవెల్లులి paste వేసిన తరువాత గరిటతో కలుపుతూ వుండాలి . లేకపోతే ఉల్లిపాయ అడుగు పడుతుంది .. 1minute తరువాత కడిగిన mint leaves (పొదిన )వేసి కలపాలి .. పొదిన కొంచం వేగిన తరువాత (2minutes ) tomato pieces (టమాట ముక్కలు )వేసి బాగా మగ్గనివ్వాలి .(5minutes ).వుడి కించి pieces గా cut చేసుకున్న potato pieces  వేయాలి ..పసుపు (turmaric ),salt ,red mirchi powder ,వేసి బాగా కలిపి మూత పెట్టాలి  (5minutes )  . mixie పట్టుకున్న masala paste ను వేసి కలపాలి . masala paste వేసాక అప్పుడప్పుడు కర్రీ ని కలుపుతూ వుండాలి లేకపోతె అడుగు పట్టి మాడు వాసన వస్తుంది .. 
చిక్కటి ,తీయటి పెరుగు లో కొంచం వాటర్ పోసి బాగా చిలకాలి .. buttermilk  లాగా  వస్తుంది ..   కర్రీ లోకి add చేసి బాగా కలిపి సాల్ట్,కారం సరిపోయినాయో లేదో చూసి కావాలంటే  add  చేసుకోవాలి .. బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించ కూడదు .. ఎందుకంటే వేడి తగ్గిన తరువాత curry చిక్కగా అవుతుంది .. అందుకే కొంచం soup లాగా ఉన్నప్పుడే coriander  leaves (కొత్తిమీర )వేసి stove -off  చేయాలి .. 

ravva laddu రవ్వ లడ్డు

రవ్వ లడ్డు ని బొంబాయి రవ్వతో (సుజీ )చేస్తారు .. రవ్వ లడ్డు taste బాగా రావటానికి main reason రవ్వ ను వేపటం .. దేనినైన వేపేటప్పుడు  flame ని sim  లోగాని medium  లోగాని పెట్టుకోవాలి .. high లో పెడితే రవ్వ వేగకుండా shade మారి పోతుందే గాని  taste బాగా రాదు .. దేనినైన వేయించుకునే టప్పుడు మందపాటి గిన్నెను వాడాలి .. దీనివల్ల item (రవ్వ )మాడిపోదు,అడుగు పట్టదు .. 
ravva laddu

ingredients 


బొంబాయి రవ్వ             - 1cup 
sugar                          -1cup 
జీడిపప్పు ,బాదంపప్పు  -1/4cup (మన ఇష్టం బట్టి )
ghee                           -1cup 
పాలు                           -small glass (1/2cup )
elachi (యాలకులు )    -6

మందపాటి గిన్నెలో   నెయ్యి వేసి , కాగిన తరువాత  జీడిపప్పు ,బాదం పప్పు లను golden shade వచ్చేవరకు   వేయించుకొని  పక్కన పెట్టుకోవాలి .. ఆ నెయ్యి(ghee )లోనే  రవ్వను వేయించుకోవాలి . రవ్వ colour మాడ కూడదు .. లడ్డు white గా  వుండదు .. కానీ sim లో ఎక్కువ సేపు వేగనివ్వాలి .. 
రవ్వ ను తింటే  పచ్చి వాసన రాకూడదు .. కరకర లాడుతున్నట్టు వుండాలి .. అప్పుడే బాగా వేగినట్టు అర్ధం ..stove -off  చేసి  sugar ను వేడిగా వున్న రవ్వకి add చేయాలి . ఎలాచి (elachi )ని కొంచం(1teaspoon )sugar వేసి mixie పట్టాలి .. ఈ powder ను రవ్వ,sugar లకు add చేసి బాగా కలపాలి .. దీనికి జీడిపప్పు ,బాదంపప్పు వేయించినవి కలపాలి .. 
కొంచం సేపు  చల్లారనివ్వాలి .. 
పాలను (milk )బాగా కాచాలి .. వేడి గా వున్న పాలను కొంచం కొంచం రవ్వ మిశ్రమానికి add  చేస్తూ  కలుపుకోవాలి .. ఉండ వచ్చేదట్టు  కలుపుకొని లడ్డు లాగా చేసుకోవాలి .. ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి .. పాలు బాగా వేడిగా ఉంటేనే ఉండ (laddu shape )వస్తుంది .. కొంచం పాలకే  రవ్వ మిశ్రమం జారుగా  అయిపోతుంది ..చాలా జాగ్రత్త గా   కొంచం కొంచం పాలు  కలుపుకోవాలి .. 

Monday, April 11, 2016

sunnivundalu సున్నుండలు

sunnudalu

సున్నుండలు  చాల బలమైన food item . చాలామంది సున్నుం డలకి మినుములు ,బెల్లం వాడతారు . ఈ రెండు health కి చాల మంచేదే గాని పిల్లలు నల్లగా ఉన్న వీటిని ఇష్టం తో తినరు .. ఈ food పిల్లల food అని చెప్ప వచ్చు .. పెద్దవారికన్నా పిల్లలకే ఇది చాలమంచిది . అందుకే పిల్లలు ఇష్టం గ తినటానికి నేను మినప గుళ్ళు (సాయిగుళ్ళు ),sugar  వాడుతున్నాను . ఇది చుడ టానికి తెల్లగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు .. taste కూడా బాగుంటుంది .. 
ingredients 

సాయి మినపప్పుగుళ్ళు  -1cup 
sugar -              1 cup 
ghee (నెయ్యి )-   1cup 

సాయిగుళ్ళు గిన్నెలో వేసి వేయించుకోవాలి (ఘీ వేయకుండా )
stove -sim లో పెట్టుకుని shade మారేవరకు వేయించుకోవాలి .గుళ్ళు వేగితే మంచి వాసన (smell )వస్తుంది .పంటితో నములు తుంటే కట్ మనే sound వస్తుంది . నములు తున్నప్పుడు పచ్చిగా అనిపించవు ..  
 అంటే బాగా వేగినాయి అని అర్ధం .. తెల్లగా వున్నా సాయిగుళ్ళు gold colour shade కి మారతాయి . 
వీటిని చల్లారిన తరువాత mixie పట్టాలి .. చాల మంది బాగా మెత్తగా పడతారు . దీనివల్ల సున్నుండ తింటున్నప్పుడు పంటికి చుట్టు కుంటున్నట్టు అనిపిస్తుంది .. అందుకే సాయిగుళ్ళు మెత్తగా mixie పట్టకూడదు .. రవ్వ జల్లెడతో జల్లిస్తే  కొంచం బరకగా వచ్చి పంటికి చుట్టుకోదు .. దీనిలో sugar ని పొడి చేసి కలపాలి . సహజంగా 1కప్ గుళ్లుకి 1cup sugar సరిపోతుంది . కావాలంటే 2-4spoons షుగర్ ని కూడా add చేసుకోవచ్చు .. ఇలా కలిపిన పిండి ready made mixer లాగా  మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఘీ కలుపుకొని ఉండలుగా చేసి తినవచ్చు . కానీ ఉండలు చేసేటప్పుడు వేడిగా వున్నా నేయ్యినే వాడాలి . ఎందుకంటే వేడిగా వున్నా నెయ్యి వల్ల ఉండ తొందరగా వస్తుంది . ఉండ గట్టిగ బిగుసుకుంటుంది . అంతే కాదు తక్కువ నెయ్యి పడుతుంది . 

Saturday, April 9, 2016

sesame powder preparation(నువ్వుల పొడి )

తెల్ల నువ్వులు health కి  చాల మంచిది . మోకాలు నొప్పి వున్నవారు daily కొంచం నువ్వులు తింటే మోకాలు పోటు తగ్గిపోతుంది . anemia రాకుండా వుంటుంది . magnesium,calcium లాంటి minerals  ఎక్కువగా వుండటం వల్ల bone strength కి ,muscles పట్టటం లాంటివి వుండవు  . 

 ingredients 

తెల్ల నువ్వులు(white sesame ) -1cup 
ఎండు మిర్చి(red mirchi ) -7
వెల్లుల్లి (garlic )-1
జీలకర్ర -1tbspoon 
సాల్ట్-1spoon (to taste )

method 

నూనె లేకుండ తెల్ల నువ్వులను వేయించుకోవాలి .నువ్వులు వేగితే మంచి smell వస్తుంది .  golden shade వచ్చే వరకు వేయించుకోవాలి . ఎండు మిర్చి ని కూడ నునె లేకుండా వేయించుకోవాలి . వెల్లులి cloves  వలుచు కోవాలి .  mixie  లో  all ingredients వేసి grind చేయాలి . salt సరిపోక పోతే  కొంచం వేసుకోవాలి .....   

rasam powder preparation

 ingredients 

కందిపప్పు - 1cup 
దనియాలు -2cups 
మిర్యాలు -2tbspoon 
మెంతులు -1tbspoon 
జీలకర్ర -2tbspoon 
పచ్చి శనగపప్పు -2tbspoons 
వెల్లులి -5రెబ్బలు 
అన్నిటిని  mixie లో మెత్తగా grind  చేసుకోవాలి .. 
రసం  మరుగు తున్నప్పుడు 3to 4spoons పొడి వేసుకొని కొంచం సేపు రసం ను మరగ నిచ్చి తాలింపు పెట్టు కోవాలి  .. 

Friday, April 8, 2016

semya payasam సేమ్యా పాయసం

సేమ్య పాయసానికి పాలు చిక్కటివి వుండాలి . చిక్కటి పాలవల్ల పాయసం చిక్కగాను, tasty గా వుంటుంది . తరువాత పాలు కాస్తున్నప్పుడు   water కలుపుకో వచ్చు. 
semya payasam

ingredients 

1. పాలు -           3cups (చిక్కనివి )
2. water -          2cups 
3. సేమ్య -           1cup 
4. సగ్గు బియ్యం - 1/2cup 
5.  sugar -          1 3/4cups 
6.  ghee -           5tbspoons 
7. జీడిపప్పు -     10
8. కిస్మిస్    -       10
9. యాలకులు -   5

method 

గిన్నెలో ఘీ వేసి, వేడి ఎక్కిన తరువాత కిస్మిస్ ,జీడిపప్పు లను వేయించు కోవాలి . కిస్మిస్ ను వేడి ఘీ లో వేయగానే పెద్ద balls  లాగా అవుతాయి . జీడిపప్పు ను  golden  shade లోకి రాగానే తీసివెయ్యాలి . ఆ ఘీ లోనే సేమ్య వేసి వేయించాలి .సెమ్య colour  మారిపోకుండా one minute వేయిస్తే సరిపోతుంది(సేమ్య colour  మారితే పాయసం white  గా ఉండదు ) . అందుకే ఎక్కువసేపు సేమ్యాని వేయించకూడదు . 
సగ్గు బియ్యం ను కొంచం (1/2cup )వాటర్ లో నానబెట్టాలి . 
చిక్కటి పాలల్లో water  కలిపి వేడి చేయాలి . పాలు పొంగు వస్తున్నప్పుడు సగ్గు బియ్యం ను వేసి ఉడక నివ్వాలి . సగ్గు బియ్యం వుడికిన తరువాత సేమ్య వేసి వుడకనివ్వాలి . సగ్గు బియ్యం ఉడక టానికి time పడుతుంది కానీ semya ఉడక టానికి టైం ఎక్కువ పట్టాదు . 5minutes  లోపే సేమ్య ఉడికి పోతుంది . సేమ్య బాగా ఉడక కూడదు . సేమ్య పేస్టు లాగా అయితే పాయసం చిక్కగా,గట్టిగా  అవుతుంది . అందంగా కూడా వుండదు . యాలుకలు చితగ్గొట్టి వెయ్యాలి . కిస్మిస్ ,జీడిపప్పు వేసి stove -off చెయ్యాలి . last లో sugar వేసి బాగా కలపాలి . sugar ను stove -on లో వున్నప్పుడు వేస్తె పాలు విరిగి పోవటానికి అవకాసం వుంది .. అందుకే స్టవ్-ఆఫ్ చేసి షుగర్ కలిపెతే మంచిది. వేడిగా వున్నప్పుడు పాయసం కొంచెం జారుగ (watery )
గా వుంటే చల్లారిన తరువాత గట్టిగ వుంటుంది .. 

Wednesday, April 6, 2016

గారెల పిండి(vada batter preparation)

vada

గారెలు చేయటం చాలా మందికి తెలుసు . కాని  అందరికి బాగా కుదరవు . దానికి కారణం పిండి . గారెల పిండి ని బట్టి గారెలు వస్తాయి . 
గారెలు ఎప్పుడు golden shade లో ఉంటే బాగుంటాయి . పైన crispy గా ఉండి లోపల మెత్తగా ఉంటాయి . golden shade లో గారెలు రావాలంటే పిండి రుబ్బెటప్పుడు పెసరపప్పు కలపాలి .. 
ఒక పెద్ద  గ్లాస్ మినప పప్పుకి  ఒక cup పెసరపప్పు కలిపి నాన బెట్టాలి .. 
పిండి రుబ్బెటప్పుడు  water ఎక్కువ పట్టవు (ఇడ్లి ,దోసాల పిండి లాగా ). పిండి ని  మరీ గట్టిగ రుబ్బకూడదు (గారి గట్టిగా వుంటుంది )అలాగని మరి జారుగా రుబ్బ కూడదు. గారెలు చేసేటప్పుడు ఉండ రాదు .. అందుకే grinder తిరగ డానికి అన్నట్టు కొంచం కొంచం water పోసుకోవాలి .. సుమారుగా ఒక చిన్న glass  water  సరిపోతుంది .   గారెలు crispy గా కావాలనుకుంటే  పిండిని మరీ మెత్తగా రుబ్బకూడదు .పిండి ని ముట్టుకుంటే ఎక్కడో కొంచెం రవ్వగా(పలుకుగా )వుండాలి . అప్పుడే గారెలు నూనెలొ వేగేటప్పుడు  పైన పిండి crispy గ లోపల పిండి మెత్తగా వేగుతాయి .. గారెలు వేసేటప్పుడు చేతిని water  తో 
ప్రతిసారి తడుపుకోవాలి .. అప్పుడే గారెలు easy  గా నునె లోకి జారుతాయి ..గారే వేగిం దనటానికి గుర్తు  గారెకు వున్న hole నుంచి నునె బయటికి వస్తుంది