Thursday, May 26, 2016

garlic and honey mixture is a wonderful medicine

garlic and honey

వెల్లుల్లి, తేనెల మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే ఏమవుతుందో తెలుసా..?
నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా తేనె ఒక అద్భుత ఔషధమని ప్రతి ఒక్కరికీ తెలుసు. దీని వల్ల కూడా మనం అనేక అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వెల్లుల్లి, తేనెలను కలిపి తయారు చేసే ఓ మిశ్రమాన్ని సేవించడం వల్ల ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో, దాని వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా పొడిగా ఉన్న ఓ చిన్నపాటి జార్‌ను తీసుకుని అందులో మెడ వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రేకుల్ని నింపాలి. అనంతరం ఆ వెల్లుల్లి రేకులు మునిగిపోయే వరకు అందులో తేనె పోయాలి. ఆ తరువాత జార్‌కు మూత పెట్టి పొడి వాతావరణంలో 2 వారాల పాటు అలాగే ఉంచాలి. రెండు రోజులకు ఒకసారి జార్ మూత తీసి అందులోని మిశ్రమాన్ని కలపాలి. దీంతో తేనె పూర్తిగా వెల్లుల్లి రేకుల్లో నిండిపోతుంది. 2 వారాల అనంతరం ఆ మిశ్రమాన్ని వాడుకోవాలి. నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమాన్ని సేవించాలి. అయితే వెల్లుల్లి రేకుల్ని పేస్ట్‌లా చేసి కూడా పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని వాడడం మొదలు పెట్టిన వారం లోపే ఫలితాలను మనం గమనించవచ్చు.
1. వెల్లుల్లి, తేనె రెండూ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ క్రమంలో వాటితో తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకుంటే ఆ శక్తి ఇంకా పెరుగుతుంది. దీని వల్ల మన శరీరం ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే విధంగా రూపుదిద్దుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. ప్రధానంగా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.
2. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

3. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి, మంట వంటివి తగ్గిపోతాయి.
4. జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
5. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.
6. శరీరంలోని విష పదార్థాలను, క్రిములను బయటకి పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. ఆర్యోగానికి పూర్తి సంరక్షణను ఇస్తుంది.
7. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.
8. శరీరంలోని అవయవాల పనితీరు మెరుగు పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
----------------
please take advise of medical practisioner  if you follow this.

No comments:

Post a Comment