సున్నుండలు చాల బలమైన food item . చాలామంది సున్నుం డలకి మినుములు ,బెల్లం వాడతారు . ఈ రెండు health కి చాల మంచేదే గాని పిల్లలు నల్లగా ఉన్న వీటిని ఇష్టం తో తినరు .. ఈ food పిల్లల food అని చెప్ప వచ్చు .. పెద్దవారికన్నా పిల్లలకే ఇది చాలమంచిది . అందుకే పిల్లలు ఇష్టం గ తినటానికి నేను మినప గుళ్ళు (సాయిగుళ్ళు ),sugar వాడుతున్నాను . ఇది చుడ టానికి తెల్లగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు .. taste కూడా బాగుంటుంది ..
ingredients
సాయి మినపప్పుగుళ్ళు -1cup
sugar - 1 cup
ghee (నెయ్యి )- 1cup
సాయిగుళ్ళు గిన్నెలో వేసి వేయించుకోవాలి (ఘీ వేయకుండా )
stove -sim లో పెట్టుకుని shade మారేవరకు వేయించుకోవాలి .గుళ్ళు వేగితే మంచి వాసన (smell )వస్తుంది .పంటితో నములు తుంటే కట్ మనే sound వస్తుంది . నములు తున్నప్పుడు పచ్చిగా అనిపించవు ..
అంటే బాగా వేగినాయి అని అర్ధం .. తెల్లగా వున్నా సాయిగుళ్ళు gold colour shade కి మారతాయి .
వీటిని చల్లారిన తరువాత mixie పట్టాలి .. చాల మంది బాగా మెత్తగా పడతారు . దీనివల్ల సున్నుండ తింటున్నప్పుడు పంటికి చుట్టు కుంటున్నట్టు అనిపిస్తుంది .. అందుకే సాయిగుళ్ళు మెత్తగా mixie పట్టకూడదు .. రవ్వ జల్లెడతో జల్లిస్తే కొంచం బరకగా వచ్చి పంటికి చుట్టుకోదు .. దీనిలో sugar ని పొడి చేసి కలపాలి . సహజంగా 1కప్ గుళ్లుకి 1cup sugar సరిపోతుంది . కావాలంటే 2-4spoons షుగర్ ని కూడా add చేసుకోవచ్చు .. ఇలా కలిపిన పిండి ready made mixer లాగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఘీ కలుపుకొని ఉండలుగా చేసి తినవచ్చు . కానీ ఉండలు చేసేటప్పుడు వేడిగా వున్నా నేయ్యినే వాడాలి . ఎందుకంటే వేడిగా వున్నా నెయ్యి వల్ల ఉండ తొందరగా వస్తుంది . ఉండ గట్టిగ బిగుసుకుంటుంది . అంతే కాదు తక్కువ నెయ్యి పడుతుంది .
Nice.. Sweet
ReplyDelete