Showing posts with label roti curry. Show all posts
Showing posts with label roti curry. Show all posts

Tuesday, April 12, 2016

potato kurma(aloo kurna)బంగాళ దుంప కుర్మా

potato  ఇష్ట పడని వాళ్ళు చాల తక్కువ మంది వుంటారు .. పిల్లలకి ఇది favourite dish అని చెప్పాలి .. carbohydrates ఎక్కువ ఉంటుందని  బరువు పెరుగుతామని చాలామంది తినరు .. ఇదే కాదు ఏ food ఐన మోతాదుకి (limit )మించి తింటే ప్రమాదమే .healthy foods తినటం workouts చేయటం body కి చాల మంచిది .. ఈ  కుర్మా చపాతీ లోకి  చాలా బావుంటుంది .. చాలామంది కుర్మా కర్రీ బాగానే చేస్తారు గాని  కర్రీ చూడటానికి కతుపులు కతుపులుగా తెల్ల తెల్ల గా  (curd వల్ల )వుంటుంది .. ఇది చూడటానికి బాగోదు .. curd  ని బాగా చిలికిన తరువాత నే కర్రీ లోకి  add చేస్తే ఇలా వుండదు  ..  
kurma

ingredients 

పొటాటో (potato )                 -1/2kg 
టమాటో (tomato )               -2
onion (ఉల్లి పాయ )              -2
green  chilli                       -5
ginger garlic paste            -2spoons  
curd (చిక్కటి పెరుగు )          -2cups 
cloves (లవంగాలు )             -5
elachi (యాలకులు )            -2
coriander (దనియాలు )        -1spoon 
poppy seeds (గసగసాలు )    -4spoons 
cashew nuts (జీడిపప్పు )     -10
mint leaves (పుదినా )          -1/4cup 
coriander leaves                 -1/2cup 
turmaric powder(పసుపు)    -pinch (చిటికెడు )
red  chili powder                 -1 1/2spoons (as per your taste )
salt                                      -1 1/2spoons  (as per your taste )     

potatoes బాగా కడిగి 4pieces గా cut చేసుకొని cooker లోగాని, పోయ్యమిదగాని ముక్కలు మునిగేవరకు water పోసి ఉడికించాలి. cooker లో అయితే ఎక్కువ water పోయనవసరం లేదు . కొంచం water పోసి 3whistles (3విజిల్స్ )వచ్చేవరకు వుడకనివ్వాలి ..  
వుడికిన తరువాత potatoes పొర వలుచుకొని చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి .. 
cloves (లవంగాలు ),elachi ,coriander (దనియాలు ),poppy seeds (గసగసాలు )   mixie  లో వేసి మెత్తగా చేయాలి .. జీడిపప్పు కూడా వేస్తె గసగసాలు మెత్తగా నలగవు . అందుకే గసగసాలు నలిగినా తరువాత cashewnuts వేసి grind  చేయాలి . దీనికి కొంచం water  add చేసి పేస్టు లాగా  చేయాలి .. 
 గిన్నెలో oil  4spoons వేసి వేడెక్కిన తరువాత 2spoons (నెయ్యి ) ghee వేయాలి . ఘీ melt  అయిన తరువాత onion pieces (ఉల్లి పాయ ముక్కలు )greenchilli pieces (పచ్చి మిర్చి ముక్కలు )వేసి golden కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి .ginger garlic paste వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి .. అల్లంవెల్లులి paste వేసిన తరువాత గరిటతో కలుపుతూ వుండాలి . లేకపోతే ఉల్లిపాయ అడుగు పడుతుంది .. 1minute తరువాత కడిగిన mint leaves (పొదిన )వేసి కలపాలి .. పొదిన కొంచం వేగిన తరువాత (2minutes ) tomato pieces (టమాట ముక్కలు )వేసి బాగా మగ్గనివ్వాలి .(5minutes ).వుడి కించి pieces గా cut చేసుకున్న potato pieces  వేయాలి ..పసుపు (turmaric ),salt ,red mirchi powder ,వేసి బాగా కలిపి మూత పెట్టాలి  (5minutes )  . mixie పట్టుకున్న masala paste ను వేసి కలపాలి . masala paste వేసాక అప్పుడప్పుడు కర్రీ ని కలుపుతూ వుండాలి లేకపోతె అడుగు పట్టి మాడు వాసన వస్తుంది .. 
చిక్కటి ,తీయటి పెరుగు లో కొంచం వాటర్ పోసి బాగా చిలకాలి .. buttermilk  లాగా  వస్తుంది ..   కర్రీ లోకి add చేసి బాగా కలిపి సాల్ట్,కారం సరిపోయినాయో లేదో చూసి కావాలంటే  add  చేసుకోవాలి .. బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించ కూడదు .. ఎందుకంటే వేడి తగ్గిన తరువాత curry చిక్కగా అవుతుంది .. అందుకే కొంచం soup లాగా ఉన్నప్పుడే coriander  leaves (కొత్తిమీర )వేసి stove -off  చేయాలి ..