Showing posts with label devotional. Show all posts
Showing posts with label devotional. Show all posts

Thursday, May 26, 2016

Lingastakam Meaning

lingaastakam

లింగాష్టకం యొక్క అర్థం మీకు తెలుసా..??
1.బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!
2.నిర్మల భాషిత శోభిత లింగం,
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!
3.జన్మజ దుఃఖ వినాశక లింగం,
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!
4.తత్ ప్రణమామి సదా శివ లింగం,
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!
దేవముని ప్రవరార్చిత లింగందేవమునులు ,
మహా ఋషులు పూజింప లింగం..!!
5.కామదహన కరుణాకర లింగం,
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను
చూపే చేతులు గల శివలింగం..!!
6.రావణ దర్ప వినాశక లింగం,
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!
7.తత్ ప్రణమామి సద శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
8.సర్వ సుగంధ సులేపిత లింగం,
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ
లింగం..!!
9.బుద్ధి వివర్ధన కారణ లింగం,
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!
10.సిద్ధ సురాసుర వందిత లింగం,
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ
శివ లింగం..!!
11.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
12.కనక మహామణి భూషిత లింగం,
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ
లింగం..!!
13.ఫణిపతి వేష్టిత శోభిత లింగం,
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ
లింగం..!!
14.దక్ష సుయజ్ఞ వినాశక లింగం,
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ
లింగం..!!
15.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
16.కుంకుమ చందన లేపిత లింగం,
కుంకుమ , గంధము పూయబడ్డ శివ
లింగం..!!
17.పంకజ హార సుశోభిత లింగం,
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ
లింగం..!!
18.సంచిత పాప వినాశక లింగం,
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!
19.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
20.దేవగణార్చిత సేవిత లింగం,
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ
లింగం..!!
21.భావైర్ భక్తీ భిరేవచ లింగం,
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ
లింగం..!!
22.దినకర కోటి ప్రభాకర లింగం,
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య
బింబం లాంటి శివ లింగం..!!
23.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
24.అష్ట దలోపరి వేష్టిత లింగం,
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ
లింగం..!!
25.సర్వ సముద్భవ కారణ లింగం,
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ
లింగం..!!
26.అష్ట దరిద్ర వినాశక లింగం,
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే
శివ లింగం..!!
27.తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
28.సురగురు సురవర పూజిత లింగం,
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప
బడ్డ శివ లింగం..!!
29.సురవన పుష్ప సదార్చిత లింగం,
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత
ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!
30.పరమపదం పరమాత్మక లింగం,
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గముతత్ ప్రణమామి
సదా శివ లింగంనీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ
లింగమా ..!!
31.లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ,
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి
చాలా పుణ్యం వస్తుంది..!!
32.శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే,
శివ లోకం లభిస్తుంది ..!! శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది . 

Tirumala వెంకటేశ్వరుడికి తల నీలాలు అర్పించడం



lord venkateswara


తిరుమలేశుడుకి తలనీలాలు సమర్పించడమంటే … మాటివ్వడమన్న మాట..! అదేమిటంటే…
ధర్మశాస్త్రాల ప్రకారం…మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులవుతాము. ఈఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే …ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తా అని దేవునికి మాటివ్వడమన్న మాట..! అంతే కాదు దీనికి ఒక కథ కూడా ఉంది.
గొల్లడి గొడ్డలి దెబ్బకి నుదుటన తగిలిన గాయాన్నీ పట్టించుకోకుండా… పుట్టను వదిలి శ్రీనివాసుడు  ముందుకు వెళుతుండగా వనదేవత “నీల”ప్రత్యక్ష్యమై…ఆవేదనతో ప్రభూ అని పలకరుంచింది… స్వామివారు చప్పున ఆగి ఆమే వైపు చూశాడు…!నీల కన్నీరు కారుస్తూ… పభూ… దేవాది దేవులైన తమకా ఈ అవస్థ… సర్వ జగద్రక్షులైనా తమకా ఈ దుస్థితి…? అంటూ స్వామివారిని ప్రక్కనే వున్న శిలపై ఆశీనులని గావించి… శ్రీనివాసుని తలపై తగిలిన గాయాన్నీ తన పమిట చెంగుతో తుడుస్తూ… మీకింత హాని తలపెట్టిన ఆ యాదవుడుకి… ప్రదమ దర్శన భాగ్యం వరాన్నీ వంశ పారం పర్యంగా అనుగ్రహించిన ఔధార్యమూర్తులు… ఈ పరిస్థితిలో ఎక్కడకి వెళ్తారు ప్రభూ అడిగింది బాధగా… స్వామివారు మందహాసం చేసి…
నీల స్వామి వారి గాయానికి పసరు మందు పూసి ఆకు వేసి కట్టబోతూ… స్వామివారి నుదుటి వైపు పరశీలనగా చూసింది… స్వామివారి శిరస్సు పై గాయం తగిలిన చోట శిరోజాలు రాలిపొయాయి… నీలా బాధతో నొచ్చుకుంటూ… ఏ మాత్రం సంకోచించకుండా తన నల్లటి శిరోజాలను తీసి స్వామివారి శిరస్సుపైన అతికించి. నీలా… స్త్రీలకి శిరోజాలే అలంకారం… నీ అలంకార శోభని నా కోసం త్యాగం చేశావా…? అని అడిగాడు శ్రీవారు… నీలా చిరునవ్వు నవ్వి నన్ను సృష్టించింది మీరు… నా సర్వస్వం మీది… పున్నమి చంద్రుని వంటి మీ అందమైన ముఖంపైన వెలితి కనిపిస్తే సహించగలనా ప్రభూ… నీ సేవ కంటే అందం అలంకారం ఎక్కువనా అంది.!
నా దర్శనం కోసం వచ్చి మొక్కుబడిగా నా భక్తులు సమర్పించుకొనే “తలనీలాలు” ఈ కలియుగాంతం వరకు మీకు చెందుతాయి.  అని ఆమే భక్తికి ఔధార్యానికి స్వామివారు మెచ్చి… వరం అనుగ్రహించారు. భక్తులు సమర్పించే వారి తలనీలాలు పుణ్యఫలంతో తిరిగి నీ శిరస్సుపై సరికొత్త నీలాలు మొలుస్తాయి… నీ ఔధార్యానికీ… సేవానిరితికి గుర్తుగా “నీలాద్రి” అన్న పేరుతో ఈ తిరుముల ప్రసిద్దమవుతుంది అని అనుగ్రహించాడు శ్రీవారు… నీలా చేతులు జోడించి… భక్తితో… ధన్యురాలిని ప్రభూ అని పలికింది…!

Tirumala pooja తిరుమల పూజా విశేషాలు

lord venkateswara

తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు
వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి
తిరుమలలో శ్రీవారికి
రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.
అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ,
సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున
జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే
ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున
మూడు గంటలకు సుప్రభాత సేవ
మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ
అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు,
శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ
వంశీకుడు (సన్నిధిగొల్ల)
దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో
గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి
గొల్ల ముందు వెళుతుండగా
అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.
కుంచెకోలను,
తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న
క్షేత్రపాలక శిలకు తాకించి
ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి
అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే
అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి
వంశీకుడు తంబురా పట్టుకుని
మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.
బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల
దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే
అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ
వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి,
మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో
తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ,
గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని
మేల్కొలుపుతుంటాడు. అర్చక
స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి
గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి
పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని
మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి
ముందు తెరను వేస్తారు. ప్రధాన
అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం
సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన
పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి
స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి
భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ
సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని
విశ్వరూప దర్శనం అంటారు.
శుద్ధి: సుప్రభాత సేవ
అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి
మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ
శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత
రాత్రి జరిగిన అలంకరణలు,
పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి
ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
అర్చన: శ్రీవారికి
ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది.
దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది)
నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న
వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి
సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష
సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి
ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు,
గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.
చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి
విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు.
ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ
స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ
సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి
భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి
ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత
మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి,
అలంకారాసనం సమర్పిస్తారు.
అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి
నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని
దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు.
తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి)
స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే
దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ
మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'...
తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన
అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని
పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో
ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ
జరిపిస్తారు.
శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన
తరువాత తోమాలసేవ చేస్తారు.
కొలువు: తోమాలసేవ తర్వాత
పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో
కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్
జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత
మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని,
ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి
విన్నవిస్తారు. ముందురోజు హుండీ
ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ,
నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ
తెలియజేస్తారు. అనంతరం నువ్వులు,
బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా
సమర్పిస్తారు.
సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30
వరకు సహస్రనామార్చన జరుగుతుంది.
బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి
వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ
అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న
పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి
దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో
మిరాశీదారు వరాహ పురాణం లోని
లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత
నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.
మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు,
అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత
స్వామివారికది నైవేద్యసమయం.
నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని
శుభ్రం చేసి, బంగారు వాకిలి
తలుపులు మూసేస్తారు. తిరుమామణి
మంటపంలోని గంటలు మోగిస్తారు.
అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి
పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి
(అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు,
దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి
(పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో
మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి.
వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది
నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి
పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి
మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన
అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది.
పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు,
పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా
సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం,
కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ
వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.
అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర
శతనామార్చన, శ్రీదేవి, భూదేవి
మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ
అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట
మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే
పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు.
ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో
కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి
పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా
పెడతారు. రాత్రిపూట స్వామివారిని
పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని
కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు.
ఏడుకొండల వాడిని
నిదురపుచ్చేందుకు అన్నమయ్య
కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి
అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల
పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో
మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో
ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
గుడిమూసే ప్రక్రియ: రాత్రి
రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ
మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ
తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి
గడియలు బిగిస్తారు.
అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై
సీళ్లు వేస్తారు.
ప్రత్యేక సేవలు
రోజువారీ అర్చనలు,
ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ,
గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి
ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి
సోమవారం విశేషపూజ,

 మంగళవారం అష్టదళ పాద
పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ,
తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి
రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం,
సహస్ర దీపాలంకరణ, ఆర్జిత
బ్రహ్మోత్సవాలు ఇవన్నీ
ఉత్సవమూర్తులకు జరిగేవి.
సడలింపు: గురువారం ప్రాతఃకాల
పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి
ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని
తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల
కన్నులు భక్తులకు కనిపిస్తాయి.
అనంతరం శ్రీవారికి 24మూరల
పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ
కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు,
శంఖచక్రాలు, కర్ణాభరణాలు,
స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి
తలుపులు తెరుస్తారు. దీన్నే
సడలింపు అంటారు.
పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని
పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ.
తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి
దివ్యమనోహర
విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.